11 May, 2026 | 5:07 PM

రాంగోపాల్ వర్మకు భారీ ఊరట

11-12-2024 02:07 AM

పోలీసు కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు కేసుల్లో మంగళవారం ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా 2022 ఏడాదిలో ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన.. టీడీపీ, జనసేన అధినేతలతో పాటు నారా లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారని పలువురు ఇటీవల ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

మొత్తం 8 ప్రాంతాల్లో ఆర్జీవీపై ఫిర్యాదులు రాగా పోలీసులు కేసులు నమోదు చేశారు. తదనంతరం విచారణకు రావాలని ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. అయితే తనపై నమోదైన కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆర్జీవీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అతడి పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం మొత్తం మూడు కేసులకు గాను ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.