11 May, 2026 | 5:29 PM

జనగణన, కులగణనలో లొసుగులు ఉన్నాయి

11-05-2026 04:40 PM

హైదరాబాద్: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన, కులగణనలో లొసుగులు ఉన్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు. హౌస్ హోల్డ్ సర్వే ఫారంలో బీసీల ప్రస్తావనే లేదని, కేవలం ఎస్సీ, ఎస్టీ అనే ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర సర్కార్ చూపుతున్న వివక్షపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని పొన్నం ప్రశ్నించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యుడిపై వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించి, నిష్పాక్షింగా దర్యాప్తు జరపాలని బాధ్యతగల కేంద్రమంత్రిగా పోలీసులను ఆదేశించాలని కోరారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేయొద్దని, బాధిత కుటుంబానికి రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి భరోసానిచ్చారు.