11 May, 2026 | 5:35 PM

యావన్‌ హత్య కేసులో 10 మంది అరెస్ట్: డీసీపీ రక్షిత

11-05-2026 04:25 PM

ప్రేమ వ్యవహారం... యువకుడిని చంపిన యువతి బంధువులు

ప్రేమ వ్యవహారం.. యావన్ ను కత్తితో 16,17 సార్లు పొడిచారు

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని చిలకలగూడలో ఈ నెల 7న జరిగిన హత్య కేసు వివరాలను డీసీపీ రక్షిత(DCP Rakshita) వెల్లడించారు. యావన్ అనే యువకుడి హత్య కేసులో 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారంలో యువతి బంధువులు యువకుడిని హత్య చేశారు. 10 మంది వ్యక్తులు ప్లాన్ చేసి యావన్ ను దారుణం చంపేశారు. నిందితుల్లో 9 మంది మేజర్లు, ఒక మైనర్ ఉన్నట్లు డీసీపీ రక్షిత పేర్కొన్నారు. ఒక నిందితుడు యావన్ ను కత్తితో 16, 17 సార్లు పొడిచాడని డీసీపీ వెల్లడించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి వెళ్లారని సూచించారు. యావన్ ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడని పోలీసులు చెప్పారు. నిందుల నుంచి కత్తి, సెల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ ప్రకటించారు.