11 May, 2026 | 5:28 PM

లంకె బిందెల కోసమే... 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చారు

11-05-2026 04:44 PM

గుప్త నిధుల కోసం వరంగల్ దేవాలయాన్ని కూల్చారు

హైదరాబాద్: వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిన కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని( Shiva Temple Demolished) మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సోమవారం నాడు పరిశీలించారు. అనంతరం హరీశ్ రావు వరంగల్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చేరిగారు. 76 ఇంటిగ్రేటెడ్ స్కూల్లకు ఈ ప్రభుత్వం టెండర్లు వేసిందని హరీశ్ రావు సూచించారు. ప్రతి స్కూల్ నిర్మాణం టెండర్ 4.96 శాతం ఎక్సెస్ పోయిందన్నారు. అన్ని టెండర్లు ఇలా ఎక్కువకు పోవటం వల్ల రూ. 496 కోట్లు కాజేస్తున్నారని ఆరోపించారు.

అన్ని స్కూళ్ల నిర్మాణం టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అనుయాయులకే కట్టబెట్టారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. గుప్త నిధుల కోసం వరంగల్ లో దేవాలయాన్ని కూల్చుతున్నారని ఆరోపించారు. అశోక్ నగర్‌లోని 800 ఏళ్ల చరిత్ర కలిగిన, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న చారిత్రక కాకతీయ మట్టి కోట శివాలయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పూజలు చేశారు. ఈ సందర్భంగా, ఆలయ పరిస్థితిని పరిశీలించిన హరీష్ రావుతో పాటు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్ పాల్గొన్నారు.