20-12-2025 01:52:59 AM
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజాచిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2026, జనవరి 13న థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ టీజర్ శుక్రవారం విడుద లైంది. టీజర్ చూస్తే.. ఇది రవితేజ క్యారెక్టర్ చుట్టూ తిరిగే ఫుల్ టెన్షన్ కామెడీ సినిమాగా సిద్ధమవుతోందన్న తెలుస్తోంది. భార్య ఉండగానే మరో అమ్మాయి జీవితంలోకి రావడంతో ఇద్దరి మధ్య నలిగిపోయే భర్త పాత్రలో రవితేజ అలరించనున్నారని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీ తం: భీమ్స్ సిసిరోలియో; డీవోపీ: ప్రసాద్ మురెళ్ల; ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్; ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాశ్.