26 July, 2026 | 1:47 AM

ప్రభుత్వాలకు గుణపాఠం

26-07-2026 12:11 AM

మాజీ మంత్రి తలసాని

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయమని, విద్యార్థులు, యువత కాక్రోచ్‌ల విజయమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులను చూసి దేశం గర్విస్తోందని, విద్యార్థుల ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వాలు గుణపాఠంలా తీసుకోవాలని పేర్కొన్నారు. మేనిఫెస్టోలు ప్రకటించేటప్పుడు, హామీలు ఇచ్చేటపుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.