20-08-2025 01:55:06 PM
సిద్దిపేట క్రైమ్: సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన సీఏఆర్ హెడ్క్వార్టర్ ను పోలీస్ కమిషనర్ బి.అనురాధ(Police Commissioner B. Anuradha) బుధవారం సందర్శించారు. మిగిలిన చిన్న చిన్న పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని హౌసింగ్ బోర్డ్ ఏఈ సుధాకర్, పోలీస్ అధికారులకు సూచించారు. కమిషనర్ వెంట ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు పూర్ణచందర్, ధరణికుమార్, కార్తీక్, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీ నితిన్, పోలీస్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఉన్నారు.