30 August, 2026 | 1:25 AM

మారిషస్‌లో తెలుగుకు తెలంగాణ అండ

30-08-2026 12:55 AM
  1. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  2. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎంతో మారిషస్ బృందం భేటీ

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాం తి): మారిషస్‌లో తెలుగు భాష, సంస్కృతి, పురాణ ఇతిహాసాలను ప్రమోట్ చేసేందుకు ఆదేశానికి అన్ని విధాలా సహకరిస్తామని మారిషస్ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం ప్రజాభవన్‌లో మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల మంత్రి లుచ్మనన్ రాజ్ పెంటియా బృందం డిప్యూటీ సీఎంతో భేటీ అయింది.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వారితో మాట్లాడుతూ.. తెలంగాణ ,-మారిషస్ మధ్య సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, ప్రజల మ ధ్య స్నేహపూర్వ సంబంధాలున్నామని గుర్తుచేశారు.

తెలుగు భాష, సంస్కృతి, సంప్రదా యాల ద్వారా తెలంగాణకు మారిషస్‌తో ప్ర త్యేక అనుబంధం ఉందన్నారు. మారిషస్‌లో ని తెలుగు సమాజం అక్కడి గొప్ప బహుళ సాంస్కృతిక సమాజంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉందన్నారు. మారిషస్ ప్రభుత్వం చేపడుతున్న రామ భజనం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని భట్టి విక్రమా ర్క చెప్పారు.

విద్య, సాంస్కృతిక పరిశోధన, కళలు, భాష, సాంస్కృతిక అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. మారిషస్‌లోని తెలుగు కల్చరల్ సెంటర్‌లో లక్షలమంది తెలుగు ప్రవాసులు తమ సం స్కృతి, సంప్రదాయాలను, భాషా పరిరక్షణ చేస్తున్నారని మారిషస్ మంత్రి తెలిపారు.

అన్నివిధాలా సహకరిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

ఆనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ ను తమ దేశం అత్యంత నమ్మకమైన భాగస్వామిగా పరిగణిస్తోందని మారిషస్ మంత్రి లుచ్మనన్ పెంతియా పేర్కొన్నారు.

మారిషస్ పబ్లిక్ సర్వీస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫారమ్స్ శాఖ మంత్రి లుచ్మనన్ పెంతియా శనివారం సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ భేటీలో పరిపాలన, టూరిజం, ఐటీ/ఐటీఈఎస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, నైపుణ్యాభివృద్ధి, విద్యా తదితర రంగాల్లో ‘తెలంగాణ మధ్య ద్వైపాక్షిక సహకా రాన్ని మరింత బలోపేతం చేసేందుకు గల అవకాశాలు, కార్యాచరణపై ఇరువురు ప్రధానంగా చర్చించారు. మారిషస్ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచేందుకు,

ఆధునిక పరిపాలనా విధానాలపై వారికి శిక్షణ ఇచ్చేందుకు సహకరించాలని మారిషస్ మం త్రి లుచ్మనన్ పెంతియా మంత్రి శ్రీధర్‌బాబును కోరారు. అన్ని రంగాల్లోనూ మారిష స్‌కు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.  అంతర్జాతీ య భాగస్వామ్యాలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

డిసెంబర్ 7, 8 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026లో పాల్గొనాలని మంత్రి లుచ్మనన్ పెంతియాను ఆహ్వానించారు. సమావేశంలో సెక్రటరీ ఫర్ పబ్లిక్ స ర్వీస్ దేవేంద్ర గోపాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఇన్నోవేషన్ (ఏఐపీఎస్‌ఐ) బోర్డ్ చైర్పర్సన్ డాక్టర్ నికోలస్ రాగోడూ, ఏఐపీఎస్‌ఐ రిజిస్ట్రార్ రమేష్ దుర్బరీ,

ఎంఈఏ బ్రాంచ్ సెక్రటేరియట్ హెడ్ మాధ వ్ ఆర్. సుల్ఫులే, ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఐటీఈఅండ్‌సీ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు.