calender_icon.png 10 February, 2026 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగరెట్ అడిగినందుకు వ్యక్తిపై దాడి

10-02-2026 12:00:00 AM

ముగ్గురు నిందితుల అరెస్టు 

ఉప్పల్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : సిగిరెట్ అడిగితే ఇవ్వనందుకు ఓ వ్యక్తిపై దాడికి దిగారు ముగ్గురు వ్యక్తులు. ఇరువురు మధ్య జరిగిన ఘర్షణ హత్యయత్నానికి దారి తీసింది. దీంతో సకాలంలో స్పందించిన నాచారం పోలీసులు కేసును నమోదుచేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ తెలిపిన ప్రకారం నాచార పారి శ్రామికవాడలోని లక్ష్మీస్టార్ ప్రైవేట్ లిమిటెడ్ సమీపంలో చిలకా నగర్ లోని నివాసముంటున్న చెందిన కిరణ్ కుమార్ (24) ప్రైవేటు ఉద్యోగి శనివారం రాత్రి చిల్కానగర్ సమీపంలో ఉన్న పాన్ డబ్బా ఉండగా చిల్కా నగర్ చెందిన పవన్ (19) గణేష్ (19) జెర్రీపోతుల జగదీష్ (19) కరణ్ కుమార్‌ను సిగ రెట్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు.

తన వద్ద సిగరెట్ లేదని పాన్ డబ్బాలో దొరుకుతుందని చెప్పడంతో ఆ ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడికి పాల్పడ్డారు. పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి తీసుకెళ్లి రాయి కట్టలతో పాటు ఎలక్ట్రికల్ టెస్టర్‌తో దాడి చేయడంతో మొఖం మెడతో పాటు శరీరంలో పలుభాగాలకు తీవ్ర రక్తం గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాధితుని ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.