1 August, 2026 | 2:23 PM

భూ వివాదంలో వ్యక్తి దారుణ హత్య

28-05-2024 12:55 AM

మరో వ్యక్తి పరిస్థితి విషమం

నారాయణఖేడ్‌లోని చాంద్‌ఖాన్ పల్లిలో ఘటన

నారాయణఖేడ్, మే 27: భూ వివాదం తో వ్యక్తి దారుణ హత్యకు గురికాగా మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైన ఘటన నారాణఖేడ్ పరిధిలోని చాంద్‌ఖాన్ పల్లిలో సోమవా రం చోటు చేసుకుంది. స్థానికులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివ రాల ప్రకారం.. గ్రామంలోని అసైన్డ్ భూమికి సంబంధించి ఆగమయ్య, మల్ల య్యలకు సంబంధించి భూ వివా దం కొనేళ్లుగా కొనసాగుతుంది. ఆగమయ్యకు చెందిన భూమి హద్దులో మల్లయ్య చెట్లుకొట్టి ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగమయ్య, మల్లయ్య వర్గాల మద్య గొడువ ముదిరింది.

దీంతో మల్లయ్య తన అనుచరులతో కలిసి ఆగమయ్య వర్గం అయిన  అంకం అశోక్, రాములుపై కత్తులు, గోడ్డళ్లతో దాడి చేయగా అంకం అశోక్ (30) అక్కడికికక్కడే మృతి చెందగా రాములుకు  తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న నారాయణఖేడ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తీవ్ర గాయాలై ప్రాణాలతో కొట్టుమి ట్టాడుతున్న రాములును చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు వైద్యులు రెఫర్ చేశారు.

హత్యకు గురైన అశోక్‌ను సైతం దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న ఖేడ్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌రెడ్డిలు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు మల్లయ్యతో పాటు ఆయన కుమారులు, సోదరుడు జ్ఞానేశ్వర్, కొండాపూర్ స్కూల్ తండాకు చెందిన దేవిసింగ్‌తో పాటు ఆయన కుమారులు, మరికొంతమంది వ్యక్తులపై కేసు నమోదు చేశారు. 

సంచలనంగా మారిన హత్య

భూ వివాదానికి సంబంధించిన హత్య ఘటన ఖేడ్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అందరితో కలుపుగోలుగా ఉండే మృతుడు అంకం అశోక్ హత్యతో విషాదం నెలకొంది. మృతుడి తండ్రి లక్ష్మయ్య మాట్లాడుతూ తాము భూమికి సంబంధించిన అం శంపై కోర్టును ఆశ్రయించారు. తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందని పేర్కొన్నారు. తమ సమస్యను పలుమార్లు ఖేడ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోలేదని వాపోయారు.