హైదరాబాద్ టు పుదుచ్చేరి
28-05-2024 12:54 AM
పటాన్‌చెరు, మే 27 : హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి నలుగురు యువకులు సైకిల్‌యాత్ర చేపట్టారు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన ధన్‌రాజ్‌గౌడ్, అరుణ్‌తేజ్‌గౌడ్, బద్రీనాథ్, పవన్ అనే యువకులు కాంగ్రెస్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు స్వగ్రా మం చిట్కుల్ నుంచి సైకిల్ యాత్రను సోమవారం నీలం మధు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 11 నుంచి 12 రోజుల పాటు సైకిల్ యాత్ర ద్వారా పుదుచ్చేరి చేరుకోనున్నారు. కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ వెంకన్న, మాజీ పీఏసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, తిరుమల్‌రెడ్డి, సంగ్రామ్, మధుసూదన్‌రెడ్డి, శివ పాల్గొన్నారు.






