calender_icon.png 12 November, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంజూరు సరే.. అభివృద్ధి ఎక్కడ?

12-11-2025 12:00:00 AM

ఆదరణకు నోచుకోని కురుమ సంఘం కమ్యూనిటీ హాలు ప్రహరీ లేక ఇబ్బందులు 

జహీరాబాద్, నవంబరు 11 : జహీరాబాద్ నియోజకవర్గంలోని కురుమ యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ ఆదరణకు నోచుకోవడం లేదు. సంఘం సభ్యుల అభ్యర్థన మేరకు మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ సమీపంలో 800 గజాల స్థలమును కేటాయించారు. అప్పటి ఎమ్మెల్యే మహమ్మద్ ఫరీదొద్దీన్ సహాయంతో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. స్వర్గీయ ఆలె నరేంద్ర పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఎంపీ నిధులనుండి కమ్యూనిటీ హాలు నిర్మించారు.

కమ్యూనిటీ హాలు నిర్మించారు  తప్ప దానికి ప్రహరీ నిర్మించకపోవడంతో ఇతరులు ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కొందరు అక్రమార్కులు ఆ ప్రాం తంలో షెడ్డు నిర్మించడంతో కురుమ యాద వ సంఘం నాయకులు పోలీసులకు ఫిర్యా దు చేసి కబ్జాను తొలగించేందుకు కృషి చేశా రు. జహీరాబాద్ ప్రాంతంలో అతిపెద్ద క మ్యూనిటీ కురుమ యాదవ సంఘం ఉన్నప్పటికీ కమిటీ హాలుకు ప్రహరీ నిర్మించలేక పోతున్నారు.

ఇతర గ్రామాల నుంచి జహీరాబాద్ వచ్చి చదువుకునే విద్యార్థులకు గానీ, ఇతర పనులు చేసుకునేందుకుగాను వచ్చేవారికి రాత్రి నివాసం ఉండేందుకు ఈ మ్యూనిటీ హాలు ఉపయోగపడుతుంది. కానీ అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో కమ్యూనిటీ హాలు నిరుపయోగంగా ఉంది. కమ్యూనిటీ హాలులో ప్రస్తుతం ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇచ్చే బియ్యం డీలర్ ఈ భవనాన్ని ఉపయోగించుకుంటున్నారు.

గత ప్రభుత్వం ఇచ్చిన 800 గజాల స్థలాన్ని సర్వే చేసి ప్రహరీ నిర్మించేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవస రం ఉంది. ఈ స్థలంలో ప్రజలకు  ఉపయోగపడే చిన్నపాటి ఫంక్షన్ హాల్ నిర్మించి నట్లయితే ప్రజలకు సౌకర్యవంతంగా ఉం టుందని, బీద, బడుగు,  బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఏవైనా చిన్నచిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ము న్సిపాలిటీ ద్వారా ఈ భవనం వద్ద మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని సంఘ నాయకులు కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ కమ్యూనిటీ హాలు వినియోగంలోకి వచ్చినట్లయితే కురుమ యాదవ సంఘం భవనం ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కొనింటి మానిక్రావు, పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ కలగజేసుకొని కురుమ యాదవ సంఘం భవనాన్ని వినియోగంలోకి తేవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.