హుస్నాబాద్‌లో స్మృతివనం ఏర్పాటు చేయాలి
01-07-2026 01:18 AM
మంత్రిని కోరిన జేఏసీ
హుస్నాబాద్, జూన్ 30: హుస్నాబాద్ అమరుల స్థూపం స్థలాన్ని కబ్జాల నుంచి రక్షించి అక్కడ ‘అమరుల స్మృతి వనం‘ ఏర్పాటు చేయాలని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.
సర్వే నంబర్లు 1189, 275లోని భూమిపై విచారణ జరిపించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని, సర్వాయి పాపన్న, గోనెల పాపన్న, బుచ్చవ్వ, అనభేరి ప్రభాకర్రావు తదితరుల విగ్రహాలు, తెలంగాణ అమరుల చరిత్రను ప్రతిబింబించే స్మారకాలు, క్రీడామైదానం, గద్దర్‌బెల్లి లలిత కళాభారతి, ఆడిటోరియం నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి,కో కన్వీనర్ మేకల వీరన్నాయాదవ్ తో పాటు వివిధ రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.






