12 July, 2026 | 9:02 PM

లక్ష మంది రాయలే

10-06-2024 12:49 AM

గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు భారీగా గైర్హాజర్

హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్షకు అభ్యర్థులు చాలా మంది గైర్హాజరయ్యారు. 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే  3.02 లక్షల మంది మాత్రమే పరీక్ష రాశారు. వివిధ శాఖల్లోని 563 గ్రూప్ పోస్టులకు తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు అభ్యర్థులు వివిధ కారణాలతో రాయలేకపోయారు. ఒక్కో పోస్టుకు దాదాపు 536 మధ్య పోటీ ఉన్నట్లు అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. నెగిటివ్ మార్కులు లేకపోవడంతో మెయిన్స్‌కు ఎక్కువ మంది సెలక్ట్ అయ్యే అవకాశం ఉంది.