నేటి నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష
10-06-2024 12:48 AM
హైదరాబాద్, జూన్ 9 (విజయక్రాంతి): సోమవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎం ట్రెన్స్ టెస్ట్ పరీక్ష నిర్వహించనున్నారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో 2024 విద్యాసంవత్సరానికి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 6.30 నుంచి 10.30 గంటల వరకు ప్రతి రోజూ 600 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీ పీఈసెట్ కన్వీనర్ రాజేష్ కుమార్ తెలిపారు.






