calender_icon.png 16 December, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్‌కు మ్యూజికల్ కాన్సర్ట్

13-12-2025 01:22:23 AM

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హంగామా ప్రారంభమవుతోంది. ఈ 2026 సంవత్సరానికి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి హైల్యాండ్‌లో డిసెంబర్ 31న రాత్రి 7 గంటలకు మ్యూజికల్ కాన్సర్ట్ ఏర్పాటు చేయనున్నారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పెషల్ న్యూ ఇయర్ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఈవెంట్ లోగోను రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “న్యూ ఇయర్ కౌంట్ డౌన్‌కు మా ఈవెంట్ నాకు పర్‌ఫెక్ట్ ప్లేస్ అవుతుంది. ఈ ఈవెంట్‌లో దాదాపు మూడు గంటల వరకు నేను సింగిల్‌గా పర్ఫామ్ చేస్తా. నా పెళ్లయిన తర్వాత ఇది నా ఫస్ట్ ఈవెంట్. ఈ న్యూ ఇయర్ ఈవెంట్ నాకు ప్రత్యేకం” అన్నారు.