28 February, 2026 | 9:54 AM

నా వ్యక్తిగత హక్కులను కాపాడండి

13-12-2025 01:21 AM

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఢిల్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కొందరు సోషల్ మీడియా, ఇపూకామర్స్ వేదికగా తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠ, హక్కులకు భంగం కలిగేలా పోస్టులు వైరల్ కావడానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ తరఫు న్యాయవాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఆ లింక్‌లను 7 రోజుల్లోగా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది.