calender_icon.png 18 September, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా ఏ నరసింహారెడ్డి

18-09-2025 12:51:14 AM

ఆ బాధ్యతల్లో ఉన్న మామిడి 

హరికృష్ణ వ్యవసాయ శాఖకు బదిలీ

హైదరాబాద్, సె ప్టెంబర్ 17 (విజయక్రాంతి):  మహబూ బ్‌నగర్ అదనపు కలెక్టర్ డా ఏనుగు నర సింహారెడ్డిని తెలంగా ణ భాష, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా రాష్ట్ర పభుత్వం నియ మించింది. డిప్యూటేషన్‌పై రెండేళ్లు ఈయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈమేరకు టూరిజం అండ్ కల్చరల్ యూత్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులుగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ మామిడి హరికృష్ణను వ్యవసాయ, సహకార శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాష్ట్ర హెరిటేజ్ డైరెక్టర్‌గా కుతాడి అర్జున్‌రావును నియమించింది.