8 March, 2026 | 3:57 PM

మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo

08-03-2026 02:16 PM

సంగీత పారిసబోయినా, ఎఫ్‌టీసీసీఐ డైరెక్టర్ సంగీత

ఘట్ కేసర్,(విజయక్రాంతి): మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యమని ఎఫ్‌టీసీసీఐ డైరెక్టర్ పారిసబోయిన సంగీత ఉన్నారు. అనురాగ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఈ-బ్లాక్ ఆడిటోరియంలో ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఫ్‌టీసీసీఐ డైరెక్టర్ సంగీత పారిసబోయిన హాజరై  ప్రసంగించారు. మహిళలు అవసరమైనప్పుడు తమ హక్కుల కోసం ధైర్యంగా నిలబడాలన్నారు. 

మహిళలకు జీవితాన్ని ప్రసాదించే, పెంచిపోషించే అపూర్వమైన శక్తి ఉందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగ ప్రదేశాల్లో మహిళల భద్రత, గౌరవం ఎంతో ముఖ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ విశ్వవిద్యాలయం ఉపకులపతి అర్చనా మంత్రి, మహిళా సంక్షేమ కమిటీ కన్వీనర్ డాక్టర్  శిరీష ప్రసంగించారు. డీన్ డాక్టర్ శ్రీనివాస చలపతి, అన్ని విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.