25-05-2025 01:08:12 AM
కిషన్‌రెడ్డికి ఈబీసీ అధ్యక్షుడి వినతిపత్రం
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ర్టంతో పాటు కేంద్రంలో జాతీయ ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ ఈబీసీ జాతీయ అధ్యక్షులు, అగ్రకులాల నిరుపేదల సంఘాల జేఏసీ చైర్మన్ వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రవీందర్ రెడ్డి దిల్ కుష్ అతిథి గృహంలో ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈబీసీల అభి వృద్ధికి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, అలాగే ఈబీసీ ఫైనాన్స్ కార్పెరేషన్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సం క్షేమానికి చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అగ్రవ ర్ణాలలోని నిరుపేదలకు వర్తింపజేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.