8 March, 2026 | 12:49 PM

మార్కెట్ కమిటీల అభివృద్ధి కొరకు ప్రత్యేక సమావేశం

08-03-2026 10:51 AM

రాబోయే 2026 27 సంవత్సరానికి బడ్జెట్ మార్కెట్ యార్డ్ల అభివృద్ధి సంబంధిత లక్ష్యంపై

ఉమ్మడి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆర్జెడియం

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో మార్కెట్ కమిటీ శాఖ అభివృద్ధి పథంలో నడవాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రివిజినల్ జాయింట్ డైరెక్టర్ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఉమ్మడి జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చైర్పర్సన్లు హాజరయ్యారు.

ఈ ప్రత్యేక సమావేశంలో రివిజినల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ అధికారి ఈ మల్లేశం మాట్లాడుతూ... ఉమ్మడి జిల్లాలోని మార్కెటింగ్ యార్డుల్లో అభివృద్ధి నూతన భవనాలు రాబోయే 2026 27 సంవత్సరంలో బడ్జెట్ సమావేశం మార్కెట్ అభివృద్ధి కొరకు సంబంధిత లక్ష్యంపై ప్రత్యేక సమావేశాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ ల తో కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు జరిగే మేలు రకము ఇతర ఇతర అవసరాల నిమిత్తం వాటిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రివిజినల్ డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ ప్రసాద్ రావు జిల్లా మార్కెట్ అధికారి రమ్య ఉమ్మడి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.