8 March, 2026 | 2:56 PM

Breaking News

అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •   శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు   •   గోపాలరావుపల్లెలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు   •  

సక్రమ తనిఖీలు చేయలేదు

25-05-2025 01:10 AM

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): ప్రముఖ విద్యాసంస్థ అయిన గోకరాజు రంగరాజు ఇన్‌స్టిట్యూ ట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీపై పలువురు ఫ్యాకల్టీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్ ద్వారా ఎన్‌బీఏ, యూజీసీ, తెలంగాణ ఉన్న త విద్యామండలి, జేఎన్టీయూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలేజీల తనిఖీల్లో భాగంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాలేజీల్లో చేపట్టిన తనిఖీలు సరిగా చేయలేదని ఆరోపించారు.

తనిఖీలప్పుడు కళాశాలలో మొత్తం అధ్యాపకుల సంఖ్య, వారి బయోమెట్రిక్ హాజరును ధ్రు వీకరించారా? అని నిలదీశారు. లేని ఫ్యాకల్టీలను ఉన్నట్లుగా సృష్టించి మోసం చేశారన్నారు. ల్యాబ్‌లను సరిగా తనిఖీలు చేశారా?

అందులో చాలా వరకు పరికరాలు పనిచేయ డం లేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అధ్యాపకుల జీతాల స్టేట్ మెంట్‌లు, ఇంక్రిమెంట్‌లను సరిపోల్చారా? అంటూ అధికారులకు పలు ప్రశ్నలతో కూడిన ఓ లేఖను గోకరాజు రంగరాజు కాలేజీ ఉద్యోగులు పంపించారు.