8 March, 2026 | 12:45 PM

జూదగాళ్ల గుట్టు రట్టు… మెరుపు దాడిలో 10 మంది అరెస్ట్

08-03-2026 10:48 AM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి గ్రామ శివారులో శనివారం జూదం ఆడుతున్న గ్యాంగ్‌పై పోలీసులు దాడి చేసి 10 మందిని అదుపులోకి తీసుకున్నామని ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద నుంచి రూ.3,240 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు చేసుకున్నామన్నారు. గ్రామ శివారులో జూదం జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో అకస్మాత్తుగా దాడి చేసి వారిని పట్టుకున్నట్లు తెలిపారు.

పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై బొజ్జ మహేష్ తెలిపారు పేర్కొన్నారు. ప్రజలు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని, ఇలాంటి జూదం వంటి కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ బొజ్జ మహేష్ సూచించారు.