calender_icon.png 15 February, 2026 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి శునకాలకు కొత్త చిరునామా

15-02-2026 01:16:30 AM

కేబీఆర్ పార్కులో పప్పీ అడాప్షన్ డ్రైవ్ 

30 దేశీయ కుక్కపిల్లల దత్తత 

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వేదికగా ఒక అద్భుత కార్యక్రమం జరిగింది. ‘బి ఏ హీరో.. అడాప్ట్ - డోంట్ షాప్’ కొనుగోలు వద్దు.. దత్తత ముద్దు అనే నినాదంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్  శనివారం నిర్వహించిన దేశీయ కుక్కపిల్లల దత్తత కార్యక్రమం విజయవంతమైంది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, ఎంపీ రేణుకా చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  దేశీయ శునకాలను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మెగా అడాప్షన్ డ్రైవ్‌లో  వివిధ రకాలకు చెందిన 50   కుక్కపిల్లలను ప్రదర్శనకు ఉంచారు.  దాదాపు 30 కుక్కపిల్లలను నగరవాసులు అక్కడికక్కడే దత్తత తీసుకున్నారు.   కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, జీహెచ్‌ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ  పాల్గొన్నారు.