23-12-2025 12:28:22 AM
చందానగర్‌లో కొత్త ఔట్‌లెట్ ప్రారంభించిన సినీ నటుడు అలీ
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ చందానగర్‌లో ఐస్‌బ ర్గ్ ఆర్గానిక్ కొత్త స్టోర్‌ను సినీ నటుడు అలీ ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి, ఏకైక ఆర్గానిక్ క్రీమరీగా ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్క్రీమ్స్ ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమం లో కొత్త ఔట్లెట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ సుహాస్‌తో పా టు పలువురు పాల్గొన్నారు.
చిన్నతనం నుం చే ఐస్క్రీమ్ అంటే ఇష్టమని, తన తల్లికి సీతాఫల్ ఐస్క్రీమ్ చాలా ఇష్టమని, ఉలవపాడు మావిడిపండు ఐస్క్రీమ్ రుచి తనను ఎంతో ఆకట్టుకుందని ఆలీ తెలిపారు. ఇలాంటి వినూత్న రుచులను ప్రజలు మరింతగా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐస్బర్గ్ మరింత అభివృద్ధి చెందాలని, మరిన్ని ఔట్లె ట్లు ప్రారంభించాలని ఆకాంక్షించారు. త్వరలోనే హైదరాబాద్‌లో మరో 23 నెలల్లో అనేక స్టోర్లను ప్రారంభించనున్నట్లు ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్క్రీమ్స్ ఫౌండర్ సుహాస్ వెల్లడించారు.
త్వరలో విజయవాడలో కూడా బ్రాం చ్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. దక్షిణ భారతమంతా విస్తరించే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. కస్టమర్ల ఆదరణ ఎల్ల ప్పుడూ ఇలాగే కొనసాగాలని కోరుకున్నారు. వంద మందికి పైగా సేంద్రీయ రైతులతో భాగస్వామ్యం కలిగిన ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్క్రీమ్స్, వారు అందించే అత్యుత్తమ ఆర్గానిక్ పదార్థాలను మాత్రమే ఉపయో గిస్తోంది.