20 March, 2026 | 8:24 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

20-03-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఆకాష్ తెలిపారు. పట్టణంలోని 16వ వార్డులో గత కొన్ని రోజులుగా వాటర్ మోటర్ పనిచేయకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తెలుసుకున్న కౌన్సిలర్ దూడల లక్ష్మి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ల దృష్టికి తీసుకు వెళ్లడంతో అధికారుల సహకారంతో నూతన వాటర్ మోటార్ ఏర్పాటు చేశారు.

గురువారం  మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, కౌన్సిలర్ దూడల లక్ష్మితో కలిసి వార్డులో నూతన వాటర్ మోటార్ బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మ ద్ మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు దూడల అశోక్, ఇప్ప నాగరాజు, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.