జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు
ఏప్రిల్‌లో కేంద్రానికి 2.43 లక్షల కోట్ల ఆదాయం
వసూళ్లలో తెలంగాణ దూకుడు
ఒక నెలలోనే 4,621 కోట్ల ఆర్జన
దేశంలోనే మూడోస్థానం కైవసం
న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): భారత్‌లో వస్తు సేవల పన్ను (జీఎ స్టీ) వసూళ్లు సరికొత్త చరిత్రను సృష్టించాయి. గత నెలలో మునుపెన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారా 2.43 లక్షల కోట్లు ఆర్జించింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈసారి నమోదైన వృద్ధిశాతం 8.7. అంటే.. నాడు కేంద్రం 2.23 లక్షల కోట్లు సా ధించింది. దిగుమతులపై వచ్చే రాబడి గణనీయంగా పెరగడం వల్ల ఈ రికార్డు స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మేక్ ఇన్ ఇండియాకు లభిస్తున్న ఆదరణ వల్ల రాబో యే రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని, రానున్న నెలల్లో వసూళ్లు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ వార్షికంగా చూస్తే మంచి వృద్ధి బాగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం మొత్తం జీఎస్టీ వసూళ్లలో 25.8 శాతం పెరిగి 57,580 కోట్లకు చేరుకున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే దక్షిణాది రాష్ట్రాలు అద్భుతమైన పనితీరును కనబరిచాయి. కర్ణాటక 42 శాతం వృద్ధితో అగ్రస్థానంలో ఉండగా, 40శాతం నమోదు చేసి మహారాష్ట్ర రెండోస్థానంలో ని లిచింది. ౩౬శాతం నమోదు చేసి తెలంగాణ మూడోస్థానాన్ని దక్కించుకున్నది.
తెలంగాణలో 35 శాతం వృద్ధి
తెలంగాణలో జీఎస్టీ వసూళ్లలో దూసుకుపోతున్నది. ఏప్రిల్‌లో రాష్ట్రానికి రూ.4,621 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే నెలలో రూ.3,433 కోట్ల ఆదాయం రాగా, ఈసారి 35 శాతం అదనంగా ఆదాయం వ చ్చింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఒక్క నెలలో ఈస్థాయిలో ఆదాయం రావడం ఇదే మొదటిసారి. గడిచిన నాలుగు నెలల నుంచి వరుసగా రూ.4,000 కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు రావడం గమనార్హం. రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు పెరగడం, ప న్ను చెల్లింపు విషయంలో పారదర్శకత, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించ డంతోనే ఇంత ఆదాయ ఆర్జన సాధ్యమైందని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ పేర్కొంది.






