ఈవీఎంల తారుమారుకు కుట్ర
ఎంతటి పోరాటానికైనా సిద్ధం
సీఎం మమతా బెనర్జీ వార్నింగ్
కోల్‌కతా, మే1: పశ్చిమ బెంగాల్‌లో ఈవీఎంలను రవాణా చేసే సమయంలో తా రుమారు చేసే కుట్ర జరుగుతోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని, అవసరమైతే చావునైనా లెక్క చేయనని, జీవన్మరణ పోరా టం చేస్తానని స్పష్టం చేశారు. మరోపక్క ఓడిపోతామనే భయంతోనే టీఎంసీ పచ్చి అ బద్ధాలు ప్రచారం చేస్తోందని బీజేపీ ఆరోపించింది. పశ్చిమ బెంగాల్‌లో పలుచోట్ల స్ట్రాం గ్ రూమ్‌ల్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌ను తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టీఎంసీ ఆరోపించింది.
దక్షిణ కోల్‌కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్‌ను మమత గురువారం రాత్రి సందర్శించారు. ఆమె పోటీ చేసిన భవానీపుర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్స్‌లను అక్కడే భద్రపరిచారు. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో కౌంటింగ్ సెంటర్ వద్ద మమతాబెనర్జీ సుమారు 3 గంటలు నిలబడ్డారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఎవరైనా ఈ వీఎం యంత్రాలను దొంగిలించడానికి, ఓట్ల లెక్కింపులో అవకతవకలు చేయడానికి ప్రయత్నిస్తే.. జీవన్మరణ పోరాటం చేస్తా’ అని అన్నారు.
బెంగాల్‌లోని అన్ని స్ట్రాంగ్రూమ్ల చుట్టూ 24 గంటలూ నిఘా ఉంచాలని మ మతా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. ఈవీఎంల నిల్వ, రవాణా స మయంలో బీజేపీ వాటిని తారుమారు చే యడానికి ప్రయత్నిస్తుందని మమతా ఆరోపించారు. ఒక సీసీటీవీ వీడియోను ఉటం కిస్తూ, కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడి యం వంటి ప్రదేశాల్లో బీజేపీ కార్యకర్తలు ఈవీఎంలను తారుమారు చేస్తున్నారని మ మత ఆరోపించారు. అయితే టీఎంసీ ఆరోపణలను బీజేపీ నేతలు కొట్టిపడేస్తున్నారు.






