అందమైన జుట్టుకు కొత్త శైలి
ప్రోలిస్ హెయిర్ బోటాక్స్ ట్రీట్‌మెంట్ జుట్టుకు నూతన కాంతి
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): హెయిర్ బోటాక్స్ స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన ‘షోనెస్’ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. మాదాపూర్‌లోని ఫ్లాగ్‌షిప్ సెలోన్‌లో ఘనంగా నిర్వహించిన ప్రో లిస్ డే వేడుకకు అందాల ప్రియులు, సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, కస్టమర్లు భారీగా హాజరై, ప్రో లిస్ హెయిర్ బోటాక్స్ ట్రీట్మెంట్ యొక్క అద్భుత ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవించారు.
ముంబై నుంచి వచ్చిన ప్రఖ్యాత ప్రో లిస్ స్పెషలిస్ట్ దర్షన్ మహేశ్ గాలా, ప్రత్యక్షంగా హెయిర్ బోటాక్స్ సెషన్లు నిర్వహించారు. షోనెస్ వ్యవస్థాపకుడు ధీరజ్ దేవలపల్లి మాట్లాడుతూ.. “ప్రో లిస్ డే నిర్వహించడం మా కోసం ఒక మైలురాయి. ప్రపంచ స్థాయి హెయిర్ కేర్ ట్రీట్మెంట్లను హైదరాబాద్‌కు తీసుకురావడం మా లక్ష్యం” అని తెలిపారు. ప్రో లిస్ స్పెషలిస్ట్ దర్షన్ మహేశ్ గాలా మాట్లాడుతూ.. “షోనెస్‌తో కలిసి పని చేయడం నాకు ఆనందంగా ఉందన్నారు. ఆధునిక సాంకేతికతను నిపుణుల అనుభవంతో మేళవించి, హెయిర్ కేర్ రంగంలో కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది.






