దేశ ద్రోహులు ఎవరో విస్తృతంగా చర్చ జరగాలి
-జస్టిస్ బీఆర్ గవాయిపై దాడిని నిరసిస్తూ 17న చలో ఢిల్లీ
-ధర్మం ముసుగులో దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు ఉండవా ?
-ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ
ఖైరతాబాద్, నవంబర్ ౩ (విజయక్రాం తి):సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బీఆర్ గవాయిపై అమానుష దాడి జరిగిన నేపథ్యంలో దేశ భక్తులు ఎవరో, దేశ ద్రోహులు ఎవరో విస్తృతంగా చర్చ జరగాలని, దేశంలో ఉంటూ భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న వారు, రాజ్యాంగాన్ని దిక్కరిస్తున్న వాళ్ళు దేశద్రోహులు అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అయన రాజ్యాంగ వ్యవస్థలో అత్తున్నతమైనదిగా ఉన్న సుప్రీం కోర్టులో చీఫ్ జస్టీస్ దళితుడైన గవాయ్ మీద అమానుషమైన దాడి జరిగి నెల రోజులు కావస్తు న్నా నేటికీ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణమని అన్నారు.
దేశ ప్రజలంతా ఈ దారుణాన్ని ఖండించినా కూడా చట్టపరమైన వ్యవస్థలు మాత్రం కనీసం సుమోటోగా కేసు స్వీకరించకుండా దళితులను చిన్నచూపు చూసాయని అన్నా రు. నిందితుడు బూట్లతో దాడి చేస్తే మౌనం గా ఉన్న వ్యవస్థలు రేపు కత్తులతో దాడులు చేసినా ఇలాగే వ్యవహరిస్తాయా అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు, న్యాయవ్యవస్థ, జాతీ య మానవ హక్కుల కమిషన్ ఈ దాడిని సుమోటోగా ఎందుకు స్వీకరించలేదు అని ప్రశ్నించారు.
ఎన్నో సంఘటనలను పత్రిక లో వచ్చిన వార్తలను ఆధారం చేసుకొని సు మోటోగా స్వీకరిస్తున్న వ్యవస్థలకు న్యాయవ్యవస్థకే సుప్రీంగా ఉన్న సుప్రీంకోర్టులో ఏకంగా చీఫ్ జస్టిస్‌పైన దాడి జరిగితే మౌనంగా ఉండడం వెనుక మర్మం ఏమిటి అని అన్నారు. ధర్మం ముసుగులో దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు ఉండవా అని ప్రశ్నించారు.
జస్టిస్ బీఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ , బాధ్యులపై కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 17 న ఛలో డిల్లీకి పిలుపునిస్తున్నామని, దేశ రాజధానిలో లక్షలాదిమంది దళితులతో కలిసి ఆత్మగౌరవ ర్యాలీ చేపడుతామని అన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎంఎస్పి జాతీయ నాయకుడు సొట్ట నరేంద్రబాబు మాదిగ, ఎంఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు ఇంజం వెంకటస్వామి మాదిగ, ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహా మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివకుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.




