29 May, 2026 | 3:30 AM

ఘనంగా బక్రీద్ వేడుకలు

29-05-2026 02:28 AM

మహబూబాబాద్, మే 28 (విజయక్రాంతి): త్యాగానికి, దాన గుణానికి నిదర్శ నంగా నిర్వహించే బక్రీద్ వేడుకలను ముస్లిములు గురువారం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక సామూహిక నమాజ్ చేశారు.

అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహారం, దుస్తులు పంపిణీ చేశారు.  మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సమాజంలో ప్రేమ, శాంతి, సోదరభావాన్ని పెంపొందిస్తుందని మత పెద్దలు పేర్కొన్నారు.

జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ప్రార్థనా స్థలాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, భద్రత కోసం అదనపు బలగాలను మోహరించారు. ప్రజలు పరస్పర గౌరవ భావంతో పండుగను ప్ర శాంత వాతావరణంలో జరుపుకున్నారు. జి ల్లాలోని పలుచోట్ల గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలను కోరుతూ ప్లెక్సీలు ప్రదర్శించారు.