27 July, 2026 | 6:55 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

సమానత్వానికి శాశ్వత దీపస్తంభం

14-04-2026 12:00 AM

నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి :

దేశ చరిత్రలో ఏప్రిల్ 14 ఒక విశిష్టమైనది. ఈ రోజు భారత రా జ్యాంగ శిల్పి, సామాజిక న్యాయ యోధుడు, సమానత్వానికి శాశ్వత దీపస్తంభమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి. 135వ జయంతి సందర్భంగా దేశమంతటా సేవలను స్మరించుకుంటూ ఆయన చూ పిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అంబేద్కర్ జీవితం ఒక సాధారణ వ్యక్తి నుంచి మహోన్నత నా యకుడిగా ఎదిగిన అద్భుత గాథ.

చిన్ననాటి నుంచే కుల వివక్ష, అసమానత అనే కఠిన వాస్తవాలను ఆయన ఎదుర్కొన్నారు. కానీ ఈ అవమానాలు కుంగదీసే బదులు, సమాజాన్ని మార్చే దిశగా ఆయనలో అగ్ని రాజేశాయి. అంబేద్కర్ విద్యాప్రయాణం ఎంతో గొప్పది. విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించి, ఆర్థిక, న్యాయ, రాజకీయ శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన సాధించిన జ్ఞానం కేవలం వ్యక్తిగత పురోగతికే పరిమితం కాకుండా, దేశ నిర్మాణానికి ఉపయోగపడింది. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.

రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించడమే ఆయన ప్రధాన లక్ష్యం. సామాజిక కులాహంకారాన్ని ఎదిరించడంలో అంబేద్కర్ పోరాటం విశేషం. దళితులు, బలహీన వర్గాలపై జరుగుతున్న అణచివేతను తట్టుకోలేక, సమానత్వం కోసం ఉద్యమించారు.

ఆయన పోరాటం కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా, మొత్తం సమాజానికి మార్గదర్శకంగా నిలిచింది. అంబేద్కర్ తత్వం మూడు ప్రధాన సూత్రాలపై ఆధారపడింది. శిక్షణ పొందండి, సంఘటితమవండి, పోరాడండి. ఈ మంత్రం నేటి యువతకు కూడా అత్యంత ప్రాసంగికం. సమసమాజ స్థాపనకు ప్రతి విద్యార్థి ఈ మూడు సూత్రాలను పాటించాలి.





పగుడాకుల బాలస్వామి

9912975753