తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
- మరమ్మతులు చేపట్టిన కౌన్సిలర్ ఇంద్రసేన
ఇంటింటికీ నీటి సరఫరా పునరుద్ధరణ
జిన్నారం/అమీన్ పూర్, మార్చి 13 :గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని దాచారం గ్రామంలో పగిలిపోయిన తాగునీటి పైపులను మరమ్మత్తులు నిర్వహించి ఇంటింటికీ నీటి సరఫరా పునరుద్ధరించేందుకు 15వ వార్డు కౌన్సిలర్ ఇంద్రసేన చర్యలు చేపట్టారు. గ్రా మంలో కొంతకాలంగా తాగునీటి పైపులు పగిలిపోవడంతో నీటి సరఫరా అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను స్థానిక ప్రజలు కౌన్సిలర్ ఇంద్రసేన దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి సంబంధిత మున్సిపల్ అధికారులతో మాట్లాడి పైపుల మరమ్మత్తు పనులు నిర్వహించారు. మున్సిపల్ సిబ్బంది
పగిలిపోయిన పైపులను సరిచేసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో గ్రామ ప్రజలకు తిరిగి ఇంటింటికీ తాగునీరు అందుబాటులోకి తీసుకొచ్చారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించిన కౌన్సిలర్ ఇం ద్రసేనకు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఇంద్రసేన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. భవి ష్యత్తులో కూడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.




