23 August, 2026 | 2:21 PM

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

13-11-2024 12:22 AM

రాజేంద్రనగర్, నవంబర్12: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యకి(55)రోడ్డు దాటుతుండగా షాద్‌నగర్‌వైపు నుంచి వచ్చిన ఓ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి సంబంధీకులు 87126 63308 నంబర్‌లో సంప్రదించాలని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.