calender_icon.png 23 January, 2026 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

24-09-2024 01:33:34 AM

నల్లగొండ, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): స్కూటర్ అదుపుతప్పి వ్యక్తి మృతిచెందాడు. వేములపల్లి మండ లం శెట్టిపాలెం గ్రామానికి చెందిన నిమ్మల మహేష్(33) డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యాపిల్లలతో కలిసి మిర్యాలగూడలో నివా సం ఉంటున్నాడు. ఈ నెల 22న డీసీఎంతో మిర్యాలగూడ నుంచి నల్లగొండకు బయల్దేరాడు. మార్యమధ్యంలో అన్నపురెడ్డిగూడెం స్టేజీ వద్ద డీసీఎం మరమ్మతులకు గురికావడంతో తెలిసిన వారి స్కూటర్ తీసుకొని మి ర్యాలగూడకు బయలుదేరాడు. మ హతేజ రైస్ మిల్లు సమీపంలో స్కూ టర్ అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం వెలుగు చూసింది.