calender_icon.png 9 January, 2026 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నారం సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి మరో ముందడుగు

08-01-2026 05:50:28 PM

డిపో మేనేజర్ ఎం కరుణ శ్రీకి వినతి పత్రం అందజేత

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామానికి ఎన్నికల్లో ఇచ్చిన ఆమీలే కాకుండా అన్నారం క్రాస్ రోడ్ నుండి సంగెం, రాజన్న దేవాలయం వరకు  రోడ్డుకి ఇరువైపులా కంపచెట్లను తొలగించడమే కాకుండా గతంలో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ 2 డిపోకు చెందిన బస్సు సర్వీసు అన్నారం గ్రామానికి పునరుద్ధరించాలని గురువారం డిపో మేనేజర్ ఎం కరుణశ్రీని, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కలిసి గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజల తరఫున వినతి పత్రం అందించగా ఆమె సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు.

మీరు మీ గ్రామ ప్రజల కోరిక మేరకు ఒకటి రెండు రోజుల్లో తప్పనిసరిగా రాత్రి నైట్ ఆల్ట్ బస్ సర్వీసు, ఉదయం బస్ సర్వీసును కీర్తిశేషులు పోగుల బిక్షం రెడ్డి స్థూపం వద్దకు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. వారు ఇచ్చిన హామీకి గ్రామ ప్రజలందరి తరపున సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి  ధన్యవాదాలు తెలిపారు.