calender_icon.png 9 January, 2026 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిజెపి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్

08-01-2026 05:53:39 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మాల్తుమ్మెద విత్త నక్షత్రంలో ఈనెల 9 నుండి 11 వరకు క్రికెట్ ప్రీమియం లీగ్ టోర్నమెంట్ ఏర్పాటు చేయనున్నట్లు నాగిరెడ్డిపేట బిజెపి నాయకురాలు కొండ మీరాతాయి తెలిపారు. ఆమె బుధవారం మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో విలేఖరి సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఈ నెల 9 నుండి 11 వరకు (కేఎంపిటిపిఎల్) క్రికెట్ ప్రీమియం లీగ్ పోటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.

పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఎలాంటి రుసుము లేకుండా తమ పేర్లను నమోదు చేసుకోవాలని వివరించారు.మొదటి బహుమతి 7777 రెండవ బహుమతి 5555 క్రీడల్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారునికి మెడల్ ఇవ్వడం జరుగుతుందన్నారు.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మాన్, అఫ్ ది సిరీస్ ఉత్తమ క్రికెటర్ ఉత్తమ బౌలర్ ఉత్తమ ప్రేక్షకులకు టీ షర్ట్ లను, షీల్డ్ లను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు రాజ్మోహన్ రెడ్డి, జిల్లా నాయకులు మేకల హనుమాన్లు, నాయకులు శ్రీకాంత్ జోడు రాజు తదితరులు పాల్గొన్నారు.