08-01-2026 05:45:52 PM
మెట్ పల్లి,(విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ లు తీసుకునే విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవని ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య తెలిపారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం రోజున బడి-బాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.సంజీవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మెట్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వేంకయ్య మాట్లాడుతూ... దోస్త్ ద్వారా కళాశాలలో అడ్మిషన్ లు జరుగుతాయి.
ఆ సమయంలో విద్యార్థులకు మొదటి దశలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పేరుతో సుమారు రెండు వందల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించ వలసి ఉంటుందని, రెండవ దశలో మాత్రం సుమారు నాలుగు వందల రూపాయలు చెల్లించ వలసి ఉంటుందని అన్నారు. అందువల్ల మొదటి దశలోనే విద్యార్థులు అధిక సంఖ్యలో చేరాలని హితవు పలికారు. ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను తామే భరిస్తామని స్పష్టం చేశారు.