12 April, 2026 | 10:43 PM

ప్రజాస్వామ్య బంగ్లాదేశ్ కోసం ప్రణాళిక

26-12-2025 01:49 AM
  1. దేశంలో శాంతి నెలకొల్పేందుకు బీఎన్పీ కృషి
  2. విద్యార్థి నాయకుడు హాదీ కలను నిజం చేస్తాం
  3. మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, బీఎన్పీ నేత తారిక్ రహమాన్
  4. మాజీ ప్రధాని హసీనా పాలనపై విమర్శలు 
  5. 17ఏళ్ల తర్వాత స్వదేశానికి చేరుకున్న ’డార్క్ ప్రిన్స్’  

ఢాకా, డిసెంబర్ 25: ప్రజాస్వామ్య బం గ్లాదేశ్‌ను నిర్మించేందుకు తన వద్ద ప్రణాళిక ఉందని  బీఎన్పీ (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ) అగ్రనేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు, డార్క్ ప్రిన్స్  తారిక్ రహమాన్  వెల్లడించాడు.  17ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన  తారిక్ రహమాన్ పార్టీ మద్దతు దారుల్ని ఉద్దేశించి ప్రసంగించాడు.  ‘ప్రజా స్వామ్య బంగ్లాదేశ్ కోసం ఇటీవల హత్యకు గురైన విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ ఎన్నో కలలు కన్నాడు..

అతడి కలను నిజం చేస్తాం.. అందు కోసం బీఎన్‌పీ అవిశ్రాంతంగా పని చేస్తుందని తెలిపారు.  ఈ ప్రయాణంలో అన్ని వర్గాలను కలుపుకుని పోతామని చె ప్పారు. 1971లో ఒకసారి..2024 జూలైలో మరోసారి స్వాతంత్య్రాన్ని సాధించుకున్నా మని, మెరుగైన బంగ్లాదేశ్‌ను నిర్మించుకు నేందుకు, శాంతి నెలకొల్పేందుకు బీఎన్‌పీ అవిశ్రాంతంగా పనిచేస్తుందని ప్రకటించారు. అదే విధంగా మాజీ ప్రధాని హసీనా పాలన పై విమర్శలు చేశారు. ఆమె పాలనలో వాక్ స్వాతంత్య్రం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి ఆరోగ్యం గుర్తించి మాట్లా డుతూ తన మనసంతా ఆమె వద్దే ఉందని తెలిపారు. ప్రసంగం అనంతరం ఆమెను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు. 

బీఎన్పీ శ్రేణుల్లో ఉత్సాహం 

తారిక్ స్వదేశానికి రావడంతో బీఎన్పీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. ఇది తారిక్ రహమాన్‌కు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యా నిస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందు కు వేలాదిగా పార్టీ మద్దతుదా రులు ఢాకా ఎయిర్‌పోర్ట్ వరకు మార్చ్ నిర్వహించారు. పార్టీ జెండాలు, నినాదా లతో ఢాకా వీధులు హోరెత్తాయి. మాజీ ప్రధాని ఖలీదా జియా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

ఈ సమయంలో కుమారుడు తారిక్ స్వదేశానికి రావడం భావోద్వేగ పరంగా కూడా ప్రాధా న్యం సంతరించు కుంది. మరోవైపు, వచ్చే ఏడాది బంగ్లాదేశ్ లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ రాకకు రాజకీయ ప్రాధాన్యతను పెంచు తున్నాయి. 

17ఏళ్లకు స్వదేశానికి..

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) అగ్రనేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రహమాన్ 17 ఏళ్ల స్వీయ బహిష్క రణ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చా రు. లండన్‌లో నివాసం ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తల్లి ఖలీదా జియా అనా రోగ్యం, అలాగే దేశంలో మారు తున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యం లో తిరిగి బంగ్లాదేశ్‌లో అడుగుపె ట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తారిక్ రహమాన్ రాకతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారీ భద్రత ను ఏర్పాటు చేశారు. పోలీసులు, ప్ర త్యేక బలగాలు అప్రమత్తంగా వ్యవ హరించాయి. విమానాశ్రయం పరి సర ప్రాంతాలను పూర్తిగా నియంత్ర ణలోకి తీసుకున్నారు.