calender_icon.png 26 December, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్లీపర్ బస్సు బుగ్గి ఆరుగురు సజీవ దహనం !

26-12-2025 01:55:08 AM

  1. కర్ణాటకలో తెల్లవారుజామున ఘోర ప్రమాదం 

  2. లారీ ఢీకొట్టడంతో బస్సులో చెలరేగిన మంటలు

  3. మంటల్లో చిక్కుకుని లారీ దగ్ధం

క్రిస్మస్ రోజు పెను విషాదం

మృతుల్లో నలుగురు మహిళలు, ఓ బాలిక, ట్రక్ డ్రైవర్

బెంగళూరు, డిసెంబర్ 25 : కర్ణాటక రా ష్ట్రంలో క్రిస్మస్ పండుగ రోజున తీవ్ర విషా దం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైంది. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. వేకువ జామున సుమారు 3 గంటల ప్రాంతంలో ఓ లారీ బస్సును బలంగా ఢీకొట్టింది. ప్ర మాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు అగ్నికి ఆహు తి అయింది. లారీ కూడా మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయింది. 

సజీవ దహనమైన ప్రయాణికులు

ప్రమాద సమయంలో బస్సులో సుమా రు 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు వేగంగా వ్యాపించడంతో బయటకు రాలేకపోయారు. నలుగు రు మహిళలు, ఒక బాలికతో పాటు ట్రక్ డ్రైవర్ సజీవ దహనమైనట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కొందరి మృ తదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

తీవ్రంగా శ్ర మించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బస్సు పూర్తిగా దగ్ధమై ఉండటంతో సహాయక చర్యలుక్లిష్టంగా మారాయి. ప్రమా దం కారణంగా ఆ మార్గంలో భారీగా ట్రాఫి క్ నిలిచిపోయింది. ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. బాధితుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ప్రమాదం జరిగింది ఇలా..

కర్ణాటక చిత్రదుర్గలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు, బస్సు డ్రైవర్, క్లీనర్ కీలక వివరాలను వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున కంటైనర్ ట్రక్ అతి వేగంగా దూసుకొచ్చి ప్రైవేటు లగ్జరీ స్లీపర్ బస్సును ఢీకొట్టిందని తెలిపారు. బస్సును ట్రక్ ఢీకొనగానే భారీగా మంటలు ఎగిసిపడ్డాయని, ఘటనా స్థలిని పొగలు అలుముకున్నాయని పరిసర ప్రాంత ప్రజలు పేర్కొన్నారు.

బస్సుకిటికీలు, పైకప్పుల మీదు గా వేగంగా మంటలు వ్యాపించడాన్ని కళ్లారా చూశామన్నారు. బస్సులోని కొంద రు ఈ మంటల్లోనే సజీవ దహనం అయ్యారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మరికొందరు కిటికీల గుండా బయటికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారని తెలిపారు.  రోడ్డు డివైడర్ అవతలి వైపు నుంచి ట్రక్ అకస్మాత్తుగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిందని బస్సు డ్రైవర్ రఫీఖ్ తెలిపాడు. ఇక ఈ ప్రమాదం కారణాలను గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తునకు సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీచేశారు.

బస్సులో అవే మిగిలాయి

బస్సులోని చాలామంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారని అధికార వర్గాలు తెలిపాయి. మంటల ధాటి అధికంగా ఉండటంతో బస్సు దారుణంగా కాలిపోయింద న్నారు. ఆ బస్సులో కొన్ని వాహన భాగాలు, ప్రయాణికుల వస్తువులు పడి ఉంటాన్ని గుర్తించామన్నారు. క్రేన్ సాయంతో కాలిపోయిన బస్సును హైవే మార్గం పైనుంచి పక్కకు జరిపామని పేర్కొన్నారు. సంఘటనా స్థలిలోకి ఎవరూ ప్రవేశించకుండా పోలీసులు పహారా కాస్తున్నారని అధికార వర్గా లు వెల్లడించాయి.

డీజిల్ ట్యాంకును ట్రక్ ఢీకొన్నందు వల్లే మంటలు : ఐజీ రవికాంతె గౌడ

‘సీబర్డ్ టూరిస్టు బస్సులోని డీజిల్ ట్యాంకును ట్రక్ ఢీకొన్నందు వల్లే మంటలు ఎగిసిపడి ఉండొచ్చని ప్రాథమిక విచారణలో గుర్తించాం. ప్రయాణికులు బస్సులో నే సజీవ దహనమై చనిపోయారు. కొందరు ప్రయాణికులు బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ట్రక్ డ్రైవర్ చనిపోయాడు. ట్రక్ రోడ్ డివైడర్ పై నుంచి దూసుకొచ్చి మరీ బస్సును ఢీకొంది. ప్రయాణికుల్లో నలుగురు మహిళలు, ఓ బాలిక మృతిచెందినట్లు గుర్తించారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు ఐజీ రవికాంతెగౌడ తెలిపారు.   

ఈ ప్రమాద వార్త విని చాలా బాధపడ్డాను : రాష్ట్రపతి ముర్ము

‘చిత్రదుర్గలో జరిగిన బస్సు ప్ర మాద ఘటన విషాదకరం. ఆ వార్తను తెలుసుకొని నేను ఆవేదనకు గురయ్యాను. ఆరుగురు ప్రాణాలు కోల్పో వడం బాధాకరం. బాధిత కుటుంబాలకు నా సంతాపాలు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని నేను ప్రార్ధిస్తా ను‘ అని ఎక్స్ వేదికగా రాష్ట్రపతి ము ర్ము ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.