calender_icon.png 18 November, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్ఫలితాలు ఇస్తున్న పోలీసు అక్క

18-11-2025 12:15:35 AM

వారంలోగా 12 ఫిర్యాదుల స్వీకరణ: ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్, నవంబర్ 17 (విజయక్రాం తి): బాలికలు గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని కష్టపడి సాధించే దిశగా కృషి చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. సోమవారం స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలీసు అక్క కార్యక్ర మంలో జిల్లా ఎస్పీ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ముందుగా జ్యోతి ప్రజలను గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం  కళాశాల విద్యార్థినిలు దేశ భక్తిని చాటేలా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భం గా విద్యార్థుల ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా 53 ‘పోలీసు అక్క‘ అనే కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు ధైర్యంగా తమ సమస్యలను పోలీసు అక్క అనే తోబుట్టువుకు తెలియజేస్తున్నారని తెలిపారు. జిల్లా పోలీసు యంత్రాంగం సత్వర చర్యలతో వారం రోజులలో 8 ఈ పెట్టి కేసులు నాలుగు కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులకు రక్షణగా జిల్లా పోలీసు వ్యవస్థ ముందుందని తెలిపారు.

మహిళలు ఎలాంటి సమస్యలు ఉన్న నిర్భయంగా తెలియజేయాలని సూచించారు. మహిళలకు రక్షణగా ఆదిలాబాద్ షీ టీం, పోలీసు అక్క, జిల్లా పోలీసు వ్యవస్థ 24 గంటలు అందుబాటులో ఉంటాయని, డయ ల్ 100 ద్వారా లేదా 8712659953 అనే నెంబర్ ద్వారా సహాయాన్ని పొందవచ్చని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. మహిళలు విద్యార్థినులకు పాఠశాల లలో, లేదా కళాశాలలో, ఇంటికి వెళ్లే దారి మార్గంలోనైనా ఎలాంటి ఇబ్బందులకు, ఈవ్ టీజింగ్లకు గురైన ధైర్యంగా తెలియజేయాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో డిఐఈఓ జాదవ్ గణేష్, డిఎస్పీ జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్  నాగరాజు, కళాశాల ప్రిన్సిపాల్ సూరత్ సింగ్, షీ టీం బృందం, పోలీసు అక్క, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.