calender_icon.png 18 November, 2025 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంఘటితంగా సమాజాన్ని అభివృద్ధి చేసుకుందాం

18-11-2025 12:17:55 AM

నిర్మల్‌లో సమైక్యత ర్యాలీ పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు

నిర్మల్ నవంబర్ 17 (విజయక్రాంతి): దేశంలో పౌరులందరూ సంఘటితంగా ఉండి సమాజ అభివృద్ధికి పాటుపడాలని బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు జి నాగేష్ పిలుపునిచ్చారు సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రం లో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడెం నగేష్, నిర్మల్, ముధోల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్.

సమైక్యత ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలో సోమవారం సాయంత్రం యూనిటీ మార్చ్ కార్యక్రమం ఘనంగా  నిర్వహించారు నిర్వహించారు. 

ముందుగా పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు ర్యాలీ ప్రారంభించారు.  అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ సాగింది. మార్గమధ్యంలోని వివేక్ చౌక్ లో గల స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీ అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సామూహికంగా జాతీయ గేయాన్ని ఆలపించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ మాట్లాడుతూ, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకొని యూనిటీ మార్చ్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషకరమైన విషయం అని అన్నారు. స్వాతంత్రం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వివరించారు.

అనేక రాజ్యాలుగా ఉన్న మన దేశాన్ని మొత్తం ఏకం చేశారని వివరించారు. నిజాం రాజ్యాన్ని కూడా హైదరాబాదులో స్వతంత్ర భారతదేశంలో వీలీనం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ అని తెలిపారు. నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్రం తర్వాత కూడా నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత దేశంలో కలపడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చోరువ మరువలేని తెలియజేశారు. 

దేశ ఐక్యత కోసం ప్రతిక్షణం పరితపించిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యతలో ప్రతి ఒక్కరు తోడ్పాటును అందిచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకళ్యాణి, జిల్లా యూత్ ఆఫీసర్ శైలి బెల్లాల్, డివైఎస్‌ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.