calender_icon.png 18 November, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ బడి నిర్మాణానికి భూమి పూజ

18-11-2025 12:13:44 AM

ఆదిలాబాద్, నవంబర్ 17 (విజయక్రాం తి): ఆసిఫాబాద్ నియోజకవర్గం పరిధిలోని గాదిగూడ మండలంలో గల కొలంగూడ గ్రామంలో ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ అఫ్ ఇండియా పథకం కింద నూతన గిరిజన ప్రభుత్వ పాఠశాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఎంపీ గోడం నగేష్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నూతన ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేసారు.

ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే లు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో విద్య ప్రమాణాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులతో పాటు అధికారులు పాల్గొన్నారు.