2 May, 2026 | 4:07 AM

లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

26-06-2024 12:42 AM
  • విద్యార్థి దుర్మరణం
  • 28 మందికి గాయాలు

కామారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కామారెడ్డి మండలం క్యాసంపల్లి శివారులోని 44వ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ సడెన్ బ్రేక్ వేయడంతో ఓ ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఆదిలాబాద్‌కు చెంది న విద్యార్థి అప్సర్‌ఖాన్(22) మృతి చెందాడు. 28మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కా మారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.

క్షతగాత్రుల్లో ఆదిలా బాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సాకెర గ్రా మానికి చెందిన జాదవ్ లక్ష్మి ఆమె భర్త జాదవ్ అరవింద్, పర్మార్‌కు చెందిన ప్రశాం త్, ఆదిలాబాద్‌కు చెందిన రుచిత, రాము, అనూష, నిర్మల్‌కు చెందిన సత్తెర, ఎస్‌కే పైజా న్, ఎస్‌కే మువి, అశ్విని, హైదారాబాద్‌కు చెం దిన అశ్విని, నవనీత, ఆదిలాబాద్‌కు చెందిన హన్మంత్, రసూల్ బీ, రుక్సాన్, నితిశ్, లక్ష్మ ణ్, కవిత, నాందెడ్‌కు చెందిన రఫీక్, హైదారాబాద్‌కు చెందిన రాణి, సంతోశ్, ఆశోక్, కర్ణాల భీముడు, సుధాం, లహరిక, గగన్‌చంద్ర, దీపిక, శ్రేయస్, కందకర్ ఉన్నారు. దేవునిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.