రెచ్చిపోయిన ఇసుకాసురులు
- ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలిస్తుండగా చెరువులోకి పోనిచ్చిన డ్రైవర్
కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు
రాజన్న సిరిసిల్ల, జూన్ 25 (విజయక్రాంతి): అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులకు అక్రమార్కులు చుక్కలు చూపెట్టారు. ముస్తాబాద్ మండలం నామాపూర్‌లో ఐదు ట్రాక్టర్లలో ఇసుకను నింపుకొని ముస్తాబాద్ వెళ్తున్న క్రమంలో బ్లూ కోర్టు పోలీసులు అడ్డుకున్నారు. బ్లూ కోర్టు కానిస్టేబుల్ సత్య నారాయణ ముస్తాబాద్ ఎస్సైకి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న ఎస్సై శేఖర్ ట్రాక్టర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా.. కానిస్టేబుల్ సత్యనారాయణ రామ లక్ష్మణ పల్లెకు చెందిన ట్రాక్టర్ పైకి ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఉద్దేశపూరకంగా ట్రాక్టర్‌ను నామాపుర్ చెరువులోకి పోనివ్వడంతో కానిస్టేబుల్ సత్యనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ చెరువు నీటిలో మునిగిపోయింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






