21-01-2026 12:00:00 AM
13 మందికి గాయాలు తప్పిన బారీ ప్రమాదం
అశ్వారావుపేట, జనవరి 20 (విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట - సత్తపల్లి ప్రధాన రహదారిపై గట్టుగూడెం గ్రామ సమీపంలో మంగళవారం తెల్లవారు జామున అదుపు తప్పి కే.వి.ఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బోల్తా పడగా 13 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఈఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాజమండ్రి నుండి హైదరాబాదుకు 46 మంది ప్రయాణికులతో కె వీఆర్ ట్రావెల్స్ చెందిన స్లీవర్ బస్సు బయలుదేరింది. ఆర్థరాత్రి దాటిన తరువాత గట్టుగూడెం గ్రామ సమీపంలో మూల మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ప్రయాణీకులు కొందరు 108 కాల్ సెంటర్ కు సమాచారం అందించటంతో హుటాహుటిన ప్రోగామ్ మేనేజర్ జనరుద్దీన్ స్పందించి సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి మండలాలకు చెందిన 108 అంబులెన్స్ లను ఆప్రమత్తం చేసారు. ఘటునా స్థలానికి చేరుకున్న అయిలెన్స్‌లు క్షతగాత్రులను దమ్మపేట ప్రభుత్వ వైద్యశాలకు తరిలించారు.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కాళ్ల శ్యాంప్రసాదు, క్లీనర్ కాసానితోపాటు మొత్తం 13 మంది గాయ పడ్డారు. 11మందికి స్వల్పంగా గాయపడగా మరో ఇద్దరిని మెరుగైన వైద్య కోసం సత్తుపల్లి విద్యశాలకు తరిలించారు. ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న దమ్మపేట ఎస్‌ఐ సాయికిషోర్ రెడ్డి సిబ్బందితో సంఘ టనా స్థలానికి చెరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణీకులు గాడ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి బస్సు ప్రమాదం జరగ టంతో కొందరు అద్దాలు పగులకొట్టుకొని బయటకు వచ్చి 108కు సమా వారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని మోటర్ వెహికల్ అదికారులు పరిశీలించారు. బస్సులో ఉన్న మిగిలిన ప్రయాణికులను ప్రత్యామ్నాయ బస్సులు ఏర్పాటు చేసి పంపించారు.