calender_icon.png 21 January, 2026 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్వాల్‌లో మరోసారి రాజకీయ వేడి

21-01-2026 12:00:00 AM

మేడ్చల్, జనవరి 20 (విజయక్రాంతి): మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్‌లో మరోసారి రాజకీయ వేడి రగులు కుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. వెంకటాపూర్ డివిజన్ సుభాష్ నగర్ స్మశాన వాటిక కమాన్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.

ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కమాన్ ప్రారంభించడానికి సిద్ధం కాగా కాంగ్రెస్ నాయకులు వచ్చి అడ్డుకున్నారు. మాజీ మైనంపల్లి హనుమంతరావు కమాన్ కు నిధులు మంజూరు చేయించారని, మీరె లా ప్రారంభిస్తారని కాంగ్రెస్ నాయకులు అడ్డు చెప్పారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పరిస్థి తి చేయి దాటిపోయి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డిని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని సూచించారు. పోలీసుల సూచన మేరకు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇరు పార్టీల కార్యకర్తలను అక్కడి నుంచి వెళ్లగొట్టారు.