calender_icon.png 21 January, 2026 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాంటీ డ్రంక్ అండ్ డ్రైవ్‌పై అవగాహన

21-01-2026 12:00:00 AM

అవగాహనలో మేడిపల్లి సీఐ గోవిందరెడ్డి

మేడిపల్లి, జనవరి 20 (విజయక్రాంతి): ఎరైవ్ ఎలైవ్ రోడ్డు భద్రత ప్రచారంలో భాగంగా మంగళవారం మేడిపల్లి క్రోమా సెంటర్ వద్ద జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం 2026 , యాంటీ డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్యం తాగి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలపై స్థానిక ప్రజలకు మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేవలం ఒక చట్టపరమైన నేరం మాత్రమే కాదు, ఇది సమాజంపై చేసే ఘోరమైన దాడని, మీ కుటుంబం కోసం, సమాజ భద్ర త కోసం మద్యం సేవించిన తర్వాత వాహ నం నడపొద్దని, అవసరమైతే క్యాబ్, ఆటో లేదా స్నేహితుల సహాయం తీసుకోవాలి అని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వా రా మాత్రమే ప్రమాదాలను తగ్గించ వచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు నర్సింగరావు, ఉదయ్ భాస్కర్, తిరుపతి, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.