05-01-2026 12:00:00 AM
ప్రత్యేక వస్త్రాధారణతో పాల్గొన్న మహిళలు
హైదాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): ప్రముఖ సంఘ సేవకులు, మోతిలాల్, తివా డి, విష్ణు గోపాల్ తివాడిల నేతృత్వంలో ఆదివారం బేగంబజార్ ఫీల్ ఖానా పంచాయతీ బాడలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీ మహా భాగవత్ కథ ప్రవచనాలను పురస్కరించుకొని శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు.
ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పీఠాధిపతి, కేశవ్ మహారాజ్, వైజాగ్ పీఠాధిపతి పర్వత్ మహారాజ్, బృందావన్ నుంచి, భక్తి భూషణ్ బుదయాల్ మహారాజ్, దా మోదర్ మహారాజ్‌లో ముఖ్య అతిథులుగా హాజరై, శ్రీకృష్ణ భగవాన్‌కి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం 501 మంది మహిళలు ప్రత్యేక వస్త్రధారణతో వారి తలపైన కలశాలను ధరించి, భారీ కలశ శోభా యాత్రను నిర్వహించారు.
ప్రత్యేక గుర్రపు బగీలలో పీఠాధిపతులు కూర్చుని, భక్తులకు ఆశీర్వాదాలు అందజేశారు. శ్రీకృష్ణ, రాధా, సీతారామ లక్ష్మణు, ఆంజనేయు, లక్ష్మీనరసింహ స్వామి, నారద ముని వేషాధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. వేడుకల్లో మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్, బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యా దవ్, బీజేపీ నాయకులు మహేందర్ వ్యాస్, శ్రీరామ్‌వ్యాస్, రాధేశ్యాం, రాంప్రకాష్, రాం దేవ్, పవన్ పూజారి పాల్గొన్నారు. ఫీల్‌కాన మీదుగా అజిత్ ప్లాజా, బాలగంగాధర్ తిలక్ స్టాచ్ మీదుగా సంగ్రుషి భవన్‌కు చేరుకుంది.