calender_icon.png 11 January, 2026 | 9:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

05-01-2026 12:00:00 AM

ములకలపల్లి, జనవరి 4 (విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గం లోని ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట మండలాలకు చెందిన పలువురు అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి అవసరమైన వైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చికిత్స విషయంలో ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు రాకుండా చూస్తానని అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ములకలపల్లి మాజీ జెడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి తదితరులు ఉన్నారు.